నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. ఇందులో సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటించారు. వెంకట్‌ బోయినపల్లి నిర్మించిన ఈ చిత్రం క్రి‍స్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 24 విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్సీస్ లో కూడా మంచి ఓపెనింగ్స్ అందుకొని కలెక్షన్ల వర్షం కురిపించింది.

యూఎస్ లో ‘శ్యామ్‌ సింగరాయ్‌’ ప్రీమియర్స్ తర్వాత ప్రతి రోజు కూడా 50 వేల డాలర్ల వసూళ్లను రాబడుతూ దూసుకెళుతోంది. ఈ క్రమంలోనే ‘శ్యామ్‌ సింగరాయ్‌’ చిత్రం ఇప్పుడు అక్కడ 7 లక్షల 50 వేల డాలర్స్ మార్క్ ని తాజాగా క్రాస్ చేసింది. సంక్రాంతి బరి నుంచి పెద్ద సినిమాలు తప్పుకుంటున్నాయి కాబట్టి శ్యామ్ సింగ రాయ్ జోరు మరికొన్ని రోజులు కొనసాగుతుంది అని చెప్పొచ్చు. కాగా, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.