దేశంలో కరోనా మహమ్మారి కేసుల్లో మళ్లీ భారీ పెరుగుదల నమోదవుతోంది.  చాపకింద నీరులా కొత్త కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది.  కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసుల్లో కూడా భారీగా పెరుగుదల కనిపిస్తోంది. మొత్తం 23 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకూ ఇది విస్తరించింది. ఈ ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడటం, పరిమితులు విధించడంతో పెద్ద సినిమాల విడుదలని వాయిదా వేయాలని నిర్మాతలు నిర్ణయించారు.

కాగా, సంక్రాంతి బరిలో ఈ నెల 7న విడుదల కానున్న `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. మరోవైపు అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం `బంగార్రాజు`. కల్యాణ్ కృష్ణ కురసాల డైరెక్ట్ చేసిన ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సంక్రాంతి కి రిలీజ్ అవడానికి సిద్ధంగా వుంది.

అయితే సంక్రాంతి రేస్ నుంచి `ఆర్ఆర్ఆర్ `తప్పుకోవడంతో ఊహించని స్థాయిలో థియేటర్లని దక్కించుకున్నారట నాగార్జున. కాగా, ‘సోగ్గాడే చిన్నినాయనా’కి ముందు భాగంగా రూపొందిన ఈ సినిమాలో నాగ్‌కి జోడీగా రమ్యకృష్ణ, నాగచైతన్యకి జోడీగా కృతిశెట్టి నటించారు. జీ స్టూడియోస్‌తో కలిసి అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు.