ఈ ఆదివారం అనగా 20th ఫిబ్రవరి న టాలీవుడ్ ప్రముఖులందరూ సమావేశం కానున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నేతృత్వం లో టాలీవుడ్ అగ్ర కథానాయకులు, దర్శకులు ముఖ్యమంత్రి జగన్ గారి ని కలిశారు. ఆ సమావేశం తరువాత, ఈ నెలాఖరులో జి ఓ వస్తుందనుకున్న సమయం లో ఈ అత్యవసర సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఫిల్మ్ నగర్ క్లబ్ లో ఈ సమావేశం ఏర్పాటు చేసారు. 240 మంది సభ్యులకు ఆహ్వానం అందినట్లు సమాచారం. సినీ పరిశ్రమ సమస్యలు, కార్మికుల సంక్షేమం, టికెట్ ధరలు, 5 షో లు మొదలైన వాటి గురించి ఈ సమావేశం లోచర్చించే అవకాశం. నటులు, నిర్మాతలు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులకు ఇలా సినీ పరిశ్రమకు చెందిన అన్ని విభాగాల ప్రతినిధులకు ఆహ్వానాలు అందినట్లు సమాచారం.
ఈ సమావేశం తెలుగు సినీ ప్రశ్రమలో ఐక్యత ఉందన్న సంకేతాలతో పాటు, అన్ని రకాల సమస్యలకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిద్దాం. వీటితో పాటు ప్రభుత్వం ప్రతిపాదించిన విశాఖపట్నం లో స్టూడియో ఏర్పాటు ప్రతిపాదనపైనా చర్చించే అవకాశం ఉంది.