శర్వానంద్(Sharwanand), రష్మిక మందన(Rashmika) కలసి నటిస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు (aadavallu meeku joharlu )సినిమా ఈ నెల 25న విడుదల చేయలనుకున్నారు. కానీ అదే రోజున భీమ్లానాయక్(Bheemlaa Nayak ) చిత్రం కూడ విడుదల చేస్తున్నాట్టు ప్రకటించారు . దాంతో విడుదల గందరగోళంలో ఉన్న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా విడుదల తేదీని వాయిదా వేసింది. మార్చి 4న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. దీనికి సంబందించిన ఒక పోస్టర్ ని విడుదల చేసింది. దాంట్లో మార్చ్ 4న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. శర్వానంద్, రష్మీక జంటగా తిరుమల కిషోర్ (Tirumala Kishore )ఈ మూవీని తెరకెక్కించాడు.ఇప్పటికే ఈ మూవీ పాటలు ,టీజర్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రానికి దేవిశ్రీప్రసాద్(DSP) సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఊర్వశి, కుష్బూ లాంటి సీనియర్ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైన్ గా ఆడవాళ్లు మీకు జోహార్లు రాబోతోంది. శ్రీకారం, మహాసముద్రం సినిమాలతో ప్లాప్స్ అందుకున్న శర్వానంద్(Sharwanand ) ఈ మూవీ మీద నమ్మకంతో ఉన్నారు. సోలోగా వచ్చి హిట్ కొట్టాలని మార్చ్ 4న థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు.