శర్వానంద్(Sharwanand), రష్మీక (Rashmika)జంటగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వస్తున్న లేటెస్ట్ మూవీ ఆడవాళ్లు మీకు జోహార్లు(Aadavallu meeku joharlu ).తిరుమల కిషోర్ (Tirumala kishore)ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ నెల 25న ఈ మూవీ విడుదల కాబోతోంది. దాంతో ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే విడుదల అయిన ఈ మూవీ పాటలు, టీజర్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇపుడు అంచనాలు మరింత పెరగడానికి ట్రైలర్ ని ఈనెల 19న విడుదల చేయబోతున్నారు. ఇక ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్(DSP) అందించిన పాటలు పాపులర్ అయ్యాయి. లవ్ అండ్ ఫ్యామిలీ మూవీగా ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ వస్తోంది. ఇక ఇటీవల హిట్ కొట్టలేకపోతున్న శర్వానంద్(Sharwanand) ఈ మూవీపై ఆశలు పెట్టుకున్నాడు. మరి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి