శర్వానంద్(Sharwanand ) హీరోగా రష్మిక మందన(Rashmika ) హీరోయిన్ గా వస్తున్న సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు(Aadavallu meeku Joharlu ). ఇప్పటికే ఈ మూవీ నుండి వచ్చిన పాటలు, టీజర్స్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ప్రేమ ,ఆప్యాయతలతో ఫ్యామిలీ నేపద్యంలో కథ ఉంటుందని టీజర్ చూస్తే తెలుస్తోంది .ఈ మద్య కాలంలో శర్వానంద్(Sharwanand) ఖతాలో హిట్ పడలేదు .ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా హిట్ అందుకుంటుందని గట్టిగా నమ్మకం పెట్టుకున్నాడు శర్వానంద్.తిరుమల కిషోర్(Tirumala Kishore ) ఈ చిత్రాన్ని యూత్ అండ్ ఫ్యామిలీకి నచ్చే అంశాలతో తెరకెక్కించాడు.ఇప్పటికె మంచి అంచనాలు ఉన్న ఈ (Aadavallu meeku joharlu Trailer ) సినిమా ట్రైలర్ ని ఫిబ్రవరి 19న రీలిజ్ చేయనున్నారు. భీంలా నాయక్(Bheemla Nayak ) ,గని(Ghani ) లాంటి పెద్ద సినిమాలు ఉండడంతో ఆడవాళ్లు మీకు జోహార్లు ట్రైలర్ తో అంచనాలు పెంచాలని చూస్తున్నారు. కామెడీతో పాటు మూవీలో హైలెట్ అయ్యే ఎమోషనల్ అంశాలను ట్రైలర్ చూపించ బోతున్నారట. దేవిశ్రీప్రసాద్(DSP) సంగీతం అదిస్తుండగా, సుదాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. రాధిక శరత్ కూమర్, ఊర్వశి వంటి సీనియర్ నటిమనులు నటిస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు పిబ్రవరి 25న థియేటర్ లలో విడుదల కానుంది .