భారత్(India) ,వెస్టిండీస్ (IND vs wi)మధ్య టి20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే .రెండు మ్యాచ్ ల విజయంతో ఇప్పటికే సిరీస్ కూడా గెలుచుకుంది
. రెండో టీ 20 మ్యాచ్లో రోహిత్ శర్మ (Rohit sharma )తన ఆగ్రహాన్ని చూపించాడు. వెస్టిండీస్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. ఒక దశలో భారత్ ( India ) ఇచ్చిన టార్గెట్ వెస్ట్ ఇండీస్ ఛేదించేలా కనిపించింది .ఈ క్రమంలో వెస్టిండీస్ బ్యాటర్ రోమన్ పావెల్ (roman pawel) ఇచ్చిన క్యాచ్ ని బౌలర్ భువనేశ్వర్ కుమార్ జారవిడిచాడు.దాంతో కెప్టెన్ రోహిత్ శర్మ తన ఆగ్రహాన్ని చూపించాడు .వెస్టిండీస్ 26 బంతుల్లో 56 పరుగులు చేయాల్సిన నేపథ్యంలో 16 వేసిన భువనేశ్వర్ కుమార్ (Bhubaneswar Kumar ) ఒక షార్ట్ పిచ్ బంతిని వేశాడు. ఆ బంతిని బ్యాటర్ గాల్లోకి లేపడంతో భువనేశ్వర్ కుమార్ కి క్యాచ్ అందుకునే అవకాశం లభించింది. కానీ విలువైన క్యాచ్ ని భువనేశ్వర్ వదిలేయడంతో రోహిత్ rohit sharma నేల మీద పడి ఉన్న బంతిని కాలితో తంతు తన కోపాన్ని చూపించాడు. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రికెట్ అనేది ఏ క్షణంలో అయినా మారిపోయి గేమ్. ఇలాంటి ఆటలో క్యాచ్ వదలడం అనేది మ్యాచ్ విజయంపై ప్రభావం చూపిస్తుంది .భువనేశ్వర్(Bhubaneswar Kumar ) క్యాచ్ ని వదిలినప్పటికీ 19వ ఓవర్లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.