తమిళ్ లో (Tamil ) పెద్ద సినిమాలు అలాగే హిట్ అయిన సినిమాలు తెలుగులో డబ్ అవుతుంటాయి. సూర్య(Surya) ,అజిత్((Ajith) ,ధనుష్(Dhanush ) ,కార్తీ (Kaarthi )లాంటి హీరోలకి తెలుగులో క్రేజ్ ఉంది. ఇక ఇపుడు తమిళ్ నుండి వస్తున్న సినిమా టైటిల్స్ అర్థం కాకుండా వస్తున్నాయి. సూర్య నటించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఆయన సినిమాలు చాలవరకు త్రిల్ అండ్ యాక్షన్ సన్నివేశాలు ఎక్కువ ఉండేలా ఉంటాయి.ఇక సూర్య తాజా చిత్రం ఈటీ(ET). తెలుగులో కూడా ఇదే టైటిల్ తో వస్తోంది.ఇక ఈటీ అంటే అర్థం ఏంటో ప్రేక్షకులకు అర్థం కావడం లేదు.అలాగే అజిత్ హీరోగా వాలిమై (Valimai )సినిమా 24 తేదిన థియేటర్స్ లో విడుదల కానుంది .ఈ సినిమా తమిళంలో చిత్రీకరించి తెలుగులో డబ్ చేస్తున్నారు. ఇక టైటిల్ పేరు డిఫరెంట్ గా ఉండేలా ప్లాన్ చేసి మరి పెట్టారు.అసలు వాలిమై పేరుకి అర్థం ఎంటి అని కొందరు తెలుగు ప్రేక్షకులు తికమక పడుతున్నారు.