అజిత్ (Ajith)నటించిన చాలా సినిమాలు తెలుగులో(Tollywood) డబ్ చేసి విడుదల చేస్తుంటారు. చాలా వరకు తెలుగులో అజిత్ కి సక్సెస్ చిత్రాలు ఉన్నాయి.అయితే ఇప్పుడు మరో చిత్రం వాలిమైతో(Valimai ) తెలుగు థియేటర్లలో సందడి చేయబోతున్నాడు. కానీ అజిత్ (Ajith)హంగామా తెలుగులో ఒక్క రోజు మాత్రమే ఉండేలా ఉంది. ఎందుకంటే వాలిమై చిత్రం ఫిబ్రవరి 24న రీలిజ్ కానుండగా ఫిబ్రవరి 25న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan ) నటించిన బిమ్లానాయక్(Bheemlaa Nayak ) ,శర్వానంద్(Sharwanand) హిరోగా ఆడవాళ్లు మీకు జోహార్లు(Aadavaallu meeku joharlu ),వరుణ్ తేజ్(Varun Tej ) గని(Ghani ) సినిమాలు విడుదల అవుతున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో అజిత్ సినిమా విడుదల అయిన రోజు మాత్రమే ప్రేక్షకులు వీక్షించేందుకు అవకాశం ఉంది. మరి ఈసారి అజిత్ హీరోగా వస్తున్న వాలిమై సినిమా ఇలాంటి కష్ట పరిస్థితుల్లో ఎలాంటి టాక్ తెచ్ఛుకుటుందో చూడాలి.
Recent Comment