తమిళ హీరో సూర్యకి(Surya) తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే ఎన్నో సినిమాలు హిట్ అవ్వగా,ఇప్పుడు మరో కొత్త సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. సూర్య లేటెస్ట్ చిత్రం ఈటీ(ET).ఇప్పుడు ఈ సినిమా టీజర్ (ET TEASER )రానా (Rana)చేతుల మీదుగా రీలిజ్ చేశారు. ఈటి టీజర్ ఇపుడు సోషల్ మీడియాలలో ట్రెండ్ అవుతోంది.మాస్ ప్రేక్షకులను అలరించే విధంగా ఈటీ(ET) టీజర్ రూపొందించారు. ఇక మార్చ్ 10న ఈ చిత్రం విడుదల అవుతోంది . సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి పాండిరాజ్ దర్శకత్వం వహించారు.
ఒక గ్రామీణ ప్రాంతనికి చెందిన హీరోకి విలన్స్ మధ్య జరిగే మాస్ యాక్షన్ మూవీ అని టీజర్ చూస్తే అర్థమవుతోంది.ఈ సినిమాలో ప్రియంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది.ఇక టీజర్ తో అంచనాలు పెంచాడు సూర్య(Surya).ఇక టీజర్ మొత్తం యాక్షన్ సీన్స్ తో నింపేసాడు దర్శకుడు. నిప్పులు చెరగగా, శత్రువు గుండెల్లో భయం నిండగా అంటూ వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ టీజర్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లింది. ఇమాన్ (Imman)ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు.
Recent Comment