భారత వెస్టిండీస్ జట్ల మధ్య కోల్‌కతా లో జరిగిన రెండవ T20 మ్యాచ్ లో భారత్ జట్టు 8 పరుగుల తేడా తో విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు ఐదు వికెట్ల నష్ఠానికి 186 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ చెరో 52 పరుగులు చేశారు. ముఖ్యం గా రిషబ్ పంత్ కేవలం 28 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు. వెంకటేష్ అయ్యర్ కేవలం 18 బంతుల్లోనే 33 పరుగులు చేసి పంత్ కు చక్కని సహకారాన్ని అందించాడు.
అనంతరం బ్యాటింగ్ పారంభించిన వెస్టిండీస్ ని పూరన్, పావెల్ గెలిపించినంత పని చేశారు. ఆఖర్లో భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్ లు కట్టు దిట్టమైన బౌలింగ్ తో భారత్ కు విజయాన్ని అందించారు. పూరన్ 41బంతుల్లో 62 పరుగులు చేయగా, పావెల్ 36బంతుల్లో 68 పరుగులతో చివరి దాకా క్రీజ్ లో నిలిచినా వెస్టిండీస్ ని గెలిపించలేకపోయాడు.
ఉత్కంఠ భరిత మ్యాచ్ లో విజయం సాధించిన భారత్, ఇంకొక మ్యాచ్ మిగిలి వుండగానే సిరీస్ ని చేజిక్కించుకుంది.