మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram charan ) RRR తరువాత పాన్ ఇండియా సినిమాల వైపు మక్కువ చూపుతున్నాడు. మార్చి 27న రామ్ చరణ్ (Ram charan ) పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కి గుడ్ అదిరిపోయే అప్డేట్స్ ఉంటాయని తెలుస్తోంది. చరణ్ అబిమానులు కూడా వీటి కోసం ఎదురు చూస్తున్నారు. రాం చరణ్ నటిస్తున్న 15వ(RC15) సినిమా నుండి శుభవార్త రానుంది. శంకర్(Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC15 సినిమా టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదల చేయబోతున్నట్టు సమాచారం. RRR ప్రమోషన్స్ తో పాటుగా తన మూవీస్ షూటింగ్ పనులు కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. శంకర్ దర్శకత్వంలో rc 15 లో పొలిటికల్ వ్యక్తి గా చరణ్ కనిపిస్తారని తెలుస్తోంది.ఇక చరణ్ నటించిన ఆచార్య , RRR చిత్రాలు కూడా విడుదలకి సిద్ధం అయ్యాయి. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య(Ascharya) సినిమాలో ఒక ప్రత్రేక పాత్రను పోషించాడు రామ్ చరణ్. ఇక RRR సినిమా లో అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్నాడు.