నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ  చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను  #NBK107 అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకి సంబంధించిన పలు అప్డేట్స్ ను చిత్రబృందం ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీలో బాలయ్యని ఢీకొట్టే విలన్ పాత్ర కోసం కన్నడ హీరో దునియా విజయ్ ను తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మరొక క్రేజీ అప్డేట్ తో చిత్రబృందం ముందుకు వచ్చింది.

ఈ సినిమాలో లో టాలెంటెడ్ ఆర్టిస్ట్ వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించనుంది. అందుకు సంబంధించిన పోస్టర్ ను మేకర్స్ తాజాగా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. కాగా, ఈ సినిమాకు ప్రఖ్యాత రచయిత సాయి మాధవ్‌ బుర్ర డైలాగ్స్‌ రాయగా తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించగా ఈ నెల మూడో వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.