నందమూరి బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఒక మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. అఖండతో బ్లాక్ బస్టర్ కొట్టిన బాలయ్య ,అలాగే క్రాక్ తో సూపర్ హిట్ అందుకున్నారు దర్శకుడు గోపిచంద్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో nbk107 మూవీపై భారీ అంచనాలున్నాయి .ఈ మూవీ పూజ కార్యక్రమాన్ని కూడా ఇప్పటికే పూర్తి చేసుకుంది. ఈనెల 16 నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం. ఎన్.బి.కె 107 లో బాలయ్యకు ( Balakrishna) జోడీగా శృతిహాసన్( Sruthi hassan ) నటిస్తున్నారు. అలాగే క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రతో అలరించిన వరలక్ష్మి శరత్ కుమార్( Varalakshmi Sharath Kumar ) కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తోంది. వేటపాలెంలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఈ మూవీలో బాలయ్య రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నాడని సమాచారం .ఈ నెల నుండి షూటింగ్ ప్రారంభించి దసరా సందర్భంగా ఈ మూవీని థియేటర్స్ లోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. అఖండతో వంద కోట్ల క్లబ్ లో జాయిన్ అయిన బాలయ్య 107వ మూవీతో ఆ సక్సెస్ ని కంటిన్యూ చేస్తాడేమో చూడాలి.
Recent Comment