గోపిచంద్ మలినేనీ (Gopichand Malineni )దర్శకత్వంలో బాలకృష్ణ (Balakrishna )నటిస్తున్న సినిమా NbK 107.ఈ మూవీ షూటింగ్ సిరిసిల్లలో యాక్షన్ సన్నివేశాలతో మొదలు పెట్టారు.ఇక నుండి రెగ్యులర్ షూటింగ్ తెలంగాణలోనే(Telangana ) జరగనుందట.ఈ మూవీ షూటింగ్ లో బాలకృష్ణ(Balakrishna) లుంగి కట్టుకుని ఉన్న ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.శృతిహాసన్ (Shruthi hassan )హిరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్(Varalakshmi Sharath Kumar ), దునియా విజయ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమాలో బాలకృష్ణ (Balakrishna )రెండు పాత్రలు చేస్తున్నారు.60 సంవత్సరలు వృద్దునిగా ఒక పాత్ర, ఏజెంట్ రోల్ లో మరోక పాత్ర వుండనుంది. ఈ సినిమా కు పెద్దాయన అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారు అని సమాచారం. ఈ సినిమాలో బాలయ్యని అందరూ పెద్దాయన అని పిలుస్తూ ఉంటారట. అందుకే ఈ సినిమాకి పెద్దాయన అనే టైటిల్ పెట్టాలని భావిస్తున్నారు.ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్నారు. అఖండ(Akhanda ) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాలకృష్ణ మరి ఈసినిమా తో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.