నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఎన్‌బీకే107 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా ప్రారంభమైంది. ఇందులో ఇప్పటికే బాలయ్య సరసన శృతి హాసన్ ను ఓకే చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ మూవీలో మెయిన్‌ విలన్‌ పాత్ర కూడా బయటకు వచ్చింది.  యాక్షన్, ఎమోషనల్‌తో కూడిన పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌తో వస్తున్న చిత్రమిది. అందుకే ఇందులో బాలయ్యతో తలపడేందుకు పవర్‌ ఫుల్‌ విలన్‌ క్యారెక్టర్‌ను రూపొందించాడు డైరెక్టర్‌. ఇందుకోసం గోపీచంద్ మలినేని  యాక్ష‌న్ కింగ్ అర్జున్‌ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకప్పుడు హీరోగా అలరించిన యాక్ష‌న్ కింగ్ అర్జున్‌ ప్రస్తుతం అటు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, ఇటు విల‌న్‌గా న‌టిస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. అంతకుముందు ‘లై’, ‘అభిమన్యుడు’ చిత్రాల్లో విల‌న్‌గా ఆక‌ట్టుకున్న అర్జున్‌.. ఇప్పుడు సూప‌ర్ స్టార్ మ‌హేష్ తాజా చిత్రం స‌ర్కారు వారి పాట‌లోనూ విల‌న్‌గా క‌నిపించ‌నున్నార‌నే విషయం తెలిసిందే. కాగా, జ‌న‌వ‌రి 20 నుంచి బాలయ్య- గోపీచంద్ మలినేని సినిమా  రెగ్యుల‌ర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ చిత్రానికి వేట‌పాలెం అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు  ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.