రాక్ స్టార్ యష్ (Yash)హీరోగా వచ్చిన KGF సినిమా బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుంది.అయితే ఇప్పుడు KGF 2 కూడా రాబోతోంది.ఇప్పటికే KGF 2 షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయ్యింది. కానీ దర్శకుడు ప్రశాంత్ నీల్ కి(Prashanth neel) ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు నచ్చక పోవటంతో రీషూట్ చేసేపనిలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే KGF 2 నుండి వచ్చిన టీజర్స్ సూపర్ హిట్ అయ్యింది. హీరో యష్ కి (Yash)కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. ప్రస్తుతం ప్రభాస్ (Prabhas )తో సలార్(Salaar ) చిత్రంతో ప్రశాంత్ నీల్ బిజీగా వున్నప్పటికీ,KGF 2 లో కొన్ని నచ్చకపోవడంతో రీషూట్ చేస్తున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాకి ఓటిటి ఆఫర్లు చాలా వచ్చాయి.కానీ ఏ మాత్రం పట్టించుకోకుండా KGF 1 సూపర్ హిట్ గా నిలచిన నేపథ్యంలో KGF 2 కూడా అంతకు మించి సక్సెస్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తూ థియేటర్స్ లోనే ఏప్రిల్ 14న సినిమా విడుదల చేయబోతున్నారు