ఒకే రోజు మూడు చానెల్స్ లో ఉగాది ఈవెంట్ ప్రసారం చేస్తున్నారు. ఈటీవీ ఆనవాయితీ ప్రకారం ఉదయం 9 గంటలకు ప్రసారం చేస్తోంది. స్టార్ మా కూడా ఆనవాయితీ ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం చేస్తోంది. జెమినీ టీవీ వాళ్ళు మాత్రం సాయంత్రం 5 గంటలకు ప్రసారం చేస్తున్నారు.
ఈటీవీ, స్టార్ మా వాళ్ళ నుండి పోటీ తట్టుకోలేక జెమినీ టీవీ వాళ్ళు సాయంత్రం వేస్తున్నారు. ఒకదాని తరువాత ఒకటి ఈవెంట్లు వస్తూనే ఉంటాయి ఆ రోజు. జీ తెలుగు వాళ్ళు ఈ సారి ఉగాది రేస్ నుండి తప్పుకున్నారు
జీ తెలుగు వాళ్ళు, పోటీ ఎక్కువగా ఉందని, కావాలని తప్పుకున్నారా లేదా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయో కానీ, చిన్న చిన్న పండగలకు కూడా ఈవెంట్లు చేసే జీ తెలుగు వాళ్ళు, తెలుగు సంవత్సరాదిని ఎందుకు వదిలేసారో అర్ధం కావడం లేదు.
ఈవెంట్ లు మాత్రమే కాదండోయ్ స్టార్ మా వాళ్ళు ఈ ఆదివారం ప్రీమియర్ D J Tillu వేస్తున్నారు. జెమినీ వాళ్ళు శ్యామ్ సింగరాయ ప్రీమియర్ వేస్తున్నారు. ఈ ఉగాది కి కావాల్సినంత వినోదం.
ఈవెంట్స్ మాత్రం ఓవర్ డోస్ అయ్యిందనే చెప్పాలి. ఒకేరోజు 3 ఈవెంట్లు చూడడం కష్టమే. సగటు ప్రేక్షకుడిగా మనకు 3 ఈవెంట్లు, అయితే చానెల్స్ వాళ్లకు మాత్రం ఒకటే ఈవెంట్.
Recent Comment