మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (Maa) అద్యక్షుడు మంచు విష్ణు(Manchu Vishnu) ap cm జగన్ ని కలిసారు. గత కొద్ది నెలల నుండి ap లో సినిమా థియేటర్ల సీట్ల శాతం అలాగే టికెట్స్ రేట్స్ మీద ప్రభుత్వానికి, టాలీవుడ్ ఇండస్ట్రీకి మధ్య వాదనలు జరుగుతున్నాయి. ఈ సమస్య పరిష్కారం కోసం మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ముందుకు వచ్చారు. తనే కాకుండా మహేష్(Mahesh babu), ప్రభాస్(Prabhas) ,రాజమౌళి(Rajamouli) లాంటి బిగ్ సెలెబ్రిటీస్ తో జగన్ ని కలిసి సమస్య పరిష్కారానికి సహకరించాలని విజ్ఞప్తి చేసారు. కానీ ఆ సమయంలో మరో సీనియర్ నటుడు మోహన్ బాబుకు అలాగే ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అద్యక్షుడుగా ఉన్న మంచు విష్ణు మీటింగ్ కి రాలేదు. దాంతో విష్ణు మీద ట్రోల్స్ కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో నేడు విష్ణు cm జగన్ గారితో మీటింగ్ పెట్టడం ఆసక్తికరంగా మారింది. ఇది సమస్య కోసం వచ్చిన మీటింగ్ గా లేదా పర్సనల్ మీటింగ్ గా అన్నది తెలియాల్సి ఉంది.MAA అధ్యక్షుడు అయినా కానీ విష్ణుకి అంత ప్రాధాన్యత లభించడం లేదు.మరి మీటింగ్ అయ్యాక అటు జగన్ ఇటు విష్ణు ఏం చెప్తారన్నది ఆసక్తిగా మారింది