బ్రిటన్ ప్రధాని గా బాధ్యతలు చేపట్టిన లీజ్ ట్రస్ గత నెలలో ప్రవేశ పెట్టిన మినీ బడ్జెట్ తో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. లీజ్ ట్రస్ చేపట్టిన కార్యక్రమాలకు తన సొంత పార్టీ నుండి వ్యతిరేకత వచ్చింది. ఒక పక్క ఆర్థిక మాంద్యం తలెత్తే ప్రమాదం ఉందన్న ఆందోళనలో, దేశాన్ని నడపలేక తన పదవికి రాజీనామా చేశారు లీజ్ ట్రస్.
బ్రిటన్ చరిత్రలోనే అత్యంత తక్కువ రోజులు (ఆరు వారాలు) ప్రదాని గా వ్యక్తి గా రికార్డు సృష్టించారు. అయితే ఇప్పుడు బ్రిటన్ ప్రధాని గా భారత సంతతికి చెందిన రిషీ సునాక్ కు అవకాశం ఉంది. రిషి సునాక్, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు. రిషి సునాక్ ప్రధాని పదవి చేపడితే, UK కి మొదటి భారతీయ సంతతికి చెందిన వ్యక్తి గా రికార్డు సృష్టిస్తాడు. నూతన ప్రదానిని ఎన్నుకోవడానికి మరో వారం రోజులు ఆగాల్సిందే
Recent Comment