కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్, హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ ఎనిమిది వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.
ఓపెనర్లు ఆరోన్ ఫించ్(7), వెంకటేష్ అయ్యర్ (6)తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 28 పరుగులు చేసి ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. నితిష్ రానా, రస్సెల్ అద్భుతం గా ఆడి కోల్ కతా నైట్ రైడర్స్ భారీ స్కోరు సాధించడం లో ప్రధాన పాత్ర పోషించారు. నితిష్ రానా 36 బంతుల్లో 54 పరుగులు, రస్సెల్ 25 బంతుల్లో 49 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆడిన 10 మంది బ్యాట్స్ మన్ ల లో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు.
సన్ రైజర్స్, హైదరాబాద్ బౌలర్ల లో నటరాజన్ మూడు వికెట్లు తీయగా, ఉమ్రాన్ మాలిక్ రెండు వికెట్లు తీశాడు. జన్ సేన్, భువనేశ్వర్ కుమార్, జగదీశ సుచిత్ తలా వికెట్ తీశారు. అనంతరం 176 పరుగుల లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన సన్ రైజర్స్, హైదరాబాద్ కు ఇన్నింగ్స్ రెండవ ఓవర్లో ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 3 పరుగుల వద్ద పాట్ కమ్మిన్స్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. మరో ఓపెనర్ మరియు కెప్టెన్ కేన్ విలియంసన్, రాహుల్ త్రిపాఠి లు మరో వికెట్ పడకుండా ఆచి తూచి ఆడుతున్నారు. సన్ రైజర్స్, హైదరాబాద్ నాలుగు ఓవర్ ల లో ఒక వికెట్ నష్టానికి 27 పరుగులు చేసింది. ఇంకా విజయానికి సన్ రైజర్స్, హైదరాబాద్ 96 బంతుల్లో 149 పరుగులు చేయాల్సి ఉంది.
Recent Comment