కన్నడ స్టార్ హీరో యశ్(Yash) కథానాయకుడుగా, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ “కేజీఎఫ్-2″(KGF Chapter 2) నాలుగేళ్ల కిందట బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన కేజీఎఫ్ సినిమాకు సీక్వెల్గా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కేజీఎఫ్ 2 వేసవి కానుకగా ఏప్రిల్ 14న విడుదల కానుంది.
అయితే భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమాపై కన్నడ కంటే తెలుగులోనే భారీ కలెక్షన్స్ వస్తాయని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో కేజీయఫ్ 2 కి బుకింగ్స్ తెరవగానే భారీగా బుకింగ్స్ ని “కేజీఎఫ్-2” సినిమా నమోదు చేసినట్లు తెలుస్తోంది. తాజా సమాచార ప్రకారం దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా బుకింగ్స్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. ఈ బుకింగ్స్ ను చూస్తుంటేనే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు కళ్ళు చెదిరే కలెక్షన్స్ రావడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాపై అన్ని వర్గాల ఆడియన్స్లో ఓ రేంజ్ అంచనాలున్నాయి.
Recent Comment