మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అగ్ర దర్శకుడు సుకుమార్ (Sukumar)తో కలిసి ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నట్టు ఓ వార్త ఇప్పటికే తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై సెన్సేషనల్ అప్ డేట్ బయటకు వచ్చింది. ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించిన యాడ్ ఫిల్మ్ ని తాజాగా సుకుమార్ తెరకెక్కించారు. శుభగృహ రియల్ ఎస్టేట్ (Subhagruha real estate company) కంపెనీ యాడ్ ఫిల్మ్ కోసం తొలిసారి సుకుమార్ దర్శకత్వంలో చిరంజీవి నటించారు. అయితే యాడ్లో ఫుల్ ఫార్మల్ డ్రెస్ లో చిరంజీవి ఫుల్ స్టయిలిష్ గా కనిపిస్తున్నారు.
తాజాగా యాడ్ కి సంబంధించిన ఫొటోలని అభిమానులతో పంచుకున్న చిరంజీవి “దర్శకుడుగా సుకుమార్ ప్రతిభ అందరికి తెలిసిందే. ఓ ad film కోసం, వారి దర్శకత్వం లో షూటింగ్ నేను చాలా enjoy చేశాను. ఈ యాడ్ నిర్మించిన శుభగృహ రియల్ ఎస్టేట్ వారికి శుభాభినందనలు.”అని ట్వీట్ చేశారు. ఇక మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య మూవీ ఏప్రిల్ 29న రిలీజ్ కానుంది.
Recent Comment