చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఇరు జట్లు 200 పైగా స్కోర్లు నమోదు చేశాయి. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్ లో, లక్నో సూపర్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ ఋతురాజ్ గైక్వాడ్ ఒక్క పరుగుకే అవుట్ అయినా తరువాత, మరో ఓపెనర్ రాబిన్ ఉతప్ప చెలరేగి పోయాడు. కేవలం 27 బంతుల్లో 50 పరుగులు చేశాడు.
ఆ తరవాత వచ్చిన మొయిన్ ఆలీ, శివమ్ దూబే కూడా చెలరేగి పోయారు. మొయిన్ ఆలీ 22 బంతుల్లో 35 పరుగులు, శివమ్ దూబే 30 బంతుల్లో 49 పరుగులు.
అంబటి రాయుడు 20 బంతుల్లో 27 పరుగులు, ధోని 6 బంతుల్లో 16 పరుగులు, కెప్టెన్ జడేజా 9 బంతుల్లో 17 పరుగులు చేశారు.
మొత్తం గా చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్ల లో ఏడు వికెట్ల నష్ఠానానికి 210 పరుగులు చేసి, లక్నో సూపర్ జెయింట్స్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.
లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ల లో ఆవేశ్ ఖాన్, ఆండ్రూ టై, రవి బిష్ణోయ్ తలా రెండు వికెట్లు తీశారు
అనంతరం 211 పరుగుల భారీ విజయ లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో సూపర్ జెయింట్స్ కు ఓపెనర్లు రాహుల్, డికాక్ మొదటి వికెట్ కు 99 పరుగులు జోడించి శుభారంభాన్ని అందించారు.
రాహుల్ 26 బంతుల్లో 40 పరుగులు, డికాక్ 45 బంతుల్లో 61 పరుగులు చేసి అవుట్ అయ్యాక Evin Lewis బాధ్యతను భుజాన వేసుకున్నాడు. అద్భుతం గా ఆడి కేవలం 23 బంతుల్లో 55 పరుగులు (6×4 | 3×6) చేసి అజేయం గా నిలిచాడు.
ఆఖర్లో దీపక్ హూడా (8 బంతుల్లో 13 పరుగులు) , ఆయుష్ బధొని (9 బంతుల్లో 19 పరుగులు) కూడా బ్యాట్ ఝుళిపించారు.
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ల లో ప్రిటోరియస్ రెండు వికెట్లు తీయగా, బ్రేవో, దేశ్ పాండే తలా వికెట్ తీశారు. శివమ్ దూబే ఒక్క ఓవర్ లో 25 పరుగులు సమర్పించుకున్నాడు
ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ : Evin Lewis
Recent Comment