యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR ), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. ఇందులో అజయ్ దేవగణ్ సతీమణి సరోజినీ పాత్రలో శ్రియ నటించారు. మార్చి 25న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా దూసుకెళ్తూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. బాలీవుడ్లో వంద కోట్లు దాటేసిన ఈ చిత్రం ఇప్పటివరకు మొత్తంగా రూ.650 కోట్లకు పైగా వసూలు చేసింది. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమ కెరీర్ లోనే అత్యుత్తమ నటన ప్రదర్శించారు.
ఈ క్రమంలోనే వీరిద్దరి నటనకు సంబంధించి సోషల్ మీడియాలో ఆ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో కనబర్చిన నటనకు గాను ఎన్టీఆర్‌కి లేదా రామ్‌చరణ్‌కి జాతీయ ఉత్తమ నటుడిగా(National Film Awards) అవార్డు రావాలని అభిమానులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తారక్-చెర్రీ ఇద్దరిలో ఈ అవార్డు ఎవరికి దక్కుతుందంటూ పలు పోస్టులు పెడుతున్నారు. మరి ఈ సినిమాకు గాను నేషనల్ అవార్డు ఎవరికి దక్కుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..
Recent Comment