యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం.. రణం.. రుధిరం” (ఆర్ఆర్ఆర్) దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి (Rajmouli)దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr), అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్(Ramcharan) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తారక్ సరసన ఒలివియా మోరీస్, చెర్రీకి జోడిగా అలియా భట్ కనువిందు చేయనున్నారు. దాదాపు రూ. 400 కోట్లు భారీ బడ్జెట్‌తో ఈ పాన్ ఇండియా సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు.
కాగా, ఈ మోస్ట్ అవేయిటెడ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. విడుదల తేది దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ జోరు పెంచారు చిత్రబృందం. దేశవ్యాప్తంగా రోజుకో నగరం తిరుగుతూ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఢిల్లీలో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అయితే ఢిల్లీలో జరిగిన కార్యక్రమానికి బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ఆమిర్ ఖాన్‌కు నాటు నాటు పాట డాన్స్ స్టెప్పును నేర్పించారు. ఈ క్రమంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్ తో కలిసి అమీర్ ఖాన్ నాటు నాటు స్టెప్పు వేయడం అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Recent Comment