ఐకానిక్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, సెన్సేషనల్ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషనల్‌లో వచ్చిన హ్యాట‍్రిక్‌ మూవీ ‘పుష్ప: ది రైజ్‌’. ఈ చిత‍్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్లను కొల్లగొడుతూ దూసుకుపోతోంది. డిసెంబర్ 17న విడుదలైన పుష్ప ఇప్పటికే భారీ ఎత్తున కలెక్షన్లు రాబట్టి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తోంది . మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా సంస్థలు నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా రెండో భాగం ‘పుష్ప: ది రూల్‌’ షూటింగ్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది.

అయితే పుష్ప -2  సినిమా చిత్రీకరణను సుకుమార్ కేవలం 100 రోజుల్లోనే పూర్తిచేయాలని భావిస్తున్నారట.  ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభించి మే నెల నాటికి చిత్రీకరణ మొత్తం పూర్తి చేయాలని, ఆ వెంటనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభించి 2022 దసరా కానుకగా  పుష్ప-2 మూవీని విడుదల చేయాలనీ అయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటినుంచే అంతా పక్కాగా ప్లాన్ చేస్తున్నారట సుకుమార్.

ఇదిలాఉంటే, పుష్ప-2 చిత్రంలో  హీరో అల్లు అర్జున్,  ఫహద్ ఫాజిల్, అల్లు అర్జున్ మధ్య వచ్చే సీన్స్  చిత్రానికి హైలైట్ అయ్యేలా   సుకుమార్  ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.. ఇక సునీల్‌, అనసూయ పాత్రలకు కూడా రెండో పార్టులో మంచి ప్రాధాన్యం ఉండనున్నట్లు సమాచారం. కాగా, ‘పుష్ప: ది రైజ్‌’ క్లైమాక్స్‌ గురించి విభిన్నమైన మాటలు వినిపించాయి. కానీ ఆ క్లైమాక్స్‌ ఎందుకు అలా ఉందో సెకండ్‌ పార్టులో తెలుస్తుంది.