ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్‌- సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కళ్లు చెదిరే కలెక్షన్స్ రాబడుతుంది. టాలీవుడ్‌లో రూ. 100కోట్లకు పైగా కలక్షన్లు సాధించి సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగులోనే కాకుండా హిందీ సహా ఇతర భాషల్లోనూ మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే పుష్ప రాజ్ హవా మామూలుగా లేదని తెలుస్తుంది.

ఈ సినిమా అక్కడ ఏకంగా 50 కోట్ల మార్క్ ను క్రాస్ చేసి ఇప్పుడు ఒక సాలిడ్ రికార్డు ని సెట్ చేసి పెట్టింది. ఈ సినిమా విడుదలైన 16వ రోజు ఏకంగా 6 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టి ఒక సరికొత్త రికార్డును సృష్టించింది. రెండు వారాల తర్వాత కూడా పుష్ప ఈ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టడంతో ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.

కాగా, ఫిబ్రవరి నుండి పుష్ప పార్ట్ 2 సెట్స్ పైకి సెకండ్ పార్ట్ రాబోతుంది. కేవలం 100 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలనీ దర్శకుడు సుకుమార్ ఫిక్స్ అయ్యాడట. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ మొదలైతే.. మే నెల నాటికి టాకీ పార్ట్ పూర్తవ్వాలి. ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభించి.. సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలనేది సుకుమార్ ప్లాన్ గా తెలుస్తోంది.