విజయ్ దేవరకొండ (Vijay devarakonda) వాయిస్ బేస్ కి చాల వరకూ అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారు .అర్జున్ రెడ్డి ,గీత గోవిందం సినిమాలో మంచి గుర్తింపు సంపాదించాడు విజయ్. ఇప్పుడు పూరి జగన్నాథ్(Puri jaganath ) డైరెక్టర్ గా తెరకెక్కుతున్న లైగర్(Liger ) విజయ్ దేవరకొండ కెరీర్ ని మంచి మలుపు తిప్పబోతోంది. ఈ సినిమాలో విజయ్ కి జోడిగా బాలీవుడ్ నటి అనన్యా పాండె నటిస్తున్నారు. రిలీజ్ కి ముందే లైగర్(Liger) రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.ఈ చిత్రంలో బాక్సింగ్ లెజండ్ మైక్ టైసన్(Mike Tyson ) కిలక పాత్ర పోషిస్తున్నాడు.ఈ చిత్రం ఓటిటి హక్కులు ఇప్పటికే భారీ ధరకు డీల్ కుదిరినట్టు తెలుస్తోంది. దాదాపు 70 కోట్లకు అన్ని భాషల లైగర్(Liger) ఓటిటి హక్కులను ఒక పెద్ద ఓటిటి సంస్థ సొంతం చేసుకున్నట్టు సమాచారం.ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రమ్యకృష్ణ(Ramya krishna) కూడ నటిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25న విడుదలకు లైగర్ సిద్ధం అవుతోంది.