టీమిండియా, వెస్టిండీస్ (IND vs WI 3rd T20 )జట్ల మధ్య జరుగుతున్న మూడో టీ20 లో భారత్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ (Surya kumar Yadav )దుమ్మురేపాడు. తక్కువ పరుగులకే కీలక వికెట్లు కోల్పోయింది భారత్ (India) ఈ క్రమంలో బ్యాటింగ్ కి వచ్చిన సూర్య కుమార్ పోర్లు,సిక్సులతో రెచ్చిపోయాడు. కేవలం 31 బంతుల్లోనే 65 పరుగులు చేసాడు. ఒక పోర్ 7 భారీ సిక్సులతో సూర్య కుమార 65 పరుగులు చేయడంతో టీమిండియా184 పరుగులు భారీ స్కోరు చేసింది. తనకు ఇచ్చిన అవకాశాలని సూపర్ గా వాడుకుంటున్నారు సూర్య.టీ20 సిరీస్ లో తన సత్తా చాటాడు. ఐపీల్ లో అదరగొట్టే సూర్య టీమిండియా తరపున కూడా రాణించడం విశేషం.రెండో టీ20లో 37 పరుగులు చేసి ఇండియా ని గెలిపించిన సూర్య కుమార్ యాదవ్ 3వ టి 20 లో 65 పరుగులు చేసి భారత్ భారీ స్కోరు చేయడంలో ప్రముఖ పాత్ర వహించాడు