టాలీవుడ్ యంగ్ హీరోస్ లో వరుస హిట్స్ అందుకుంటున్న స్టార్ హీరో యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Naga chaitanya). ఇటీవల నాగచైతన్య నటించిన సినిమాలు వరుసగా సూపర్ హిట్ అవుతున్నాయి. వెంకి మామ ,మజిలీ ,లవ్ స్టోరీ, రీసెంట్ గా బంగార్రాజు సూపర్ హిట్ గా నిలిచాయి. ప్రస్తుతం నాగ చైతన్య థాంక్యూ(Thank You ) అనే మూవీలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన మరో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవలశ్యామ్ సింగరాయ్ తో సూపర్ హిట్ అందించిన దర్శకుడు రాహుల్ స0కృత్యన్ తో ఒక మూవీ ప్లాన్ చేశారట .శ్యామ్ సింగరాయ లాగానే ఇది కూడా ఒక కొత్త తరహా కాన్సెప్ట్ తో రాబోతున్నట్లు తెలుస్తోంది .నాగచైతన్య కూడా తన స్టోరీస్ సెలెక్షన్ మంచి కథలు ఎంచుకుంటూ సూపర్ హిట్ కోడుతున్నాడు .ఇక ఈ మూవీని టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తీస్తున్నారని సమాచారం .మరి ఈ ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుంది ,ఎవరెవరు నటిస్తారు అన్నది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది .ఇక తాజాగా నాగచైతన్య నటిస్తున్న థాంక్యూ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Recent Comment