మహేష్ బాబు ,కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్టు సర్కారు వారి పాట.ఈ మూవీ మొదటి పాటను రిలీజ్ చేయడానికి వారం ముందుగానే డిఫరెంట్ గా ప్రమోషన్ మొదలు పెట్టారు చిత్ర యూనిట్ .FEB 14న Sarkaaru Vaari Paata మూవీ నుండి Kalavathi అనే సాంగ్ ని విడుదల చేయాలని ప్లాన్ చేసారు. కానీ ఈ సాంగ్ ని ముందుగానే కొందరు లీక్ చేసి నెట్ లో పెట్టడంతో చిత్ర యూనిట్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే 14న రిలీజ్ కావాల్సిన ఈ పాటను ఈరోజే విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు. సిద్ శ్రీరామ్ పాడిన kalavathi song యూత్ ఆడియన్స్ కి సూపర్ గా నచ్చేలా ఉంది.బ్యాంక్ కుంభ కోణాల నేపథ్యంలో సాగే స్టోరితో సర్కారు వారి పాట ( Sarkaaru Vaari Paata ) చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మహేష్ బాబు ( Mahesh ) స్టయిల్ ,మ్యానరిజం సరికొత్తగా ఉండబోతోంది. ఇక కళావతి సాంగ్ ప్రోమో 5 మిలియన్స్ కి పైగా వ్యూస్ అందుకుంది. మరి kalavathi full Song వ్యూస్ ,లైక్స్ పరంగా ఎలాంటి రికార్డ్స్ బద్ధలు కొడుతుందో చూడాలి.