టాలీవుడ్ అందాల భామ సమంత (Samantha) తాజాగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా శాకుంతలం(Shakuntalam ).సీనియర్ క్రేజీ దర్శకుడు గుణశేఖర్ (Guna shekar ) డైరెక్షన్ లో పాన్ ఇండియా ప్రాజెక్టు గా తెరకెక్కుతోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు.కానీ ఇప్పుడు
శాకుంతలం ఫస్ట్ లుక్ కి సంబంధించిన అధికారిక ప్రకటన చేశారు.శాకుంతలం (Shakuntalam )మూవీ ఫస్ట్ లుక్ ని ఫిబ్రవరి 21న విడుదల చేయబోతున్నారు.

సమంత ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్ తో గుణశేఖర్ ఈ చిత్రాన్ని తీస్తున్నారు. ఫస్ట్ లుక్ తోనే అంచనాలు పెంచడానికి సన్నాహాలు చేస్తున్నారు.దాంతో శాకుంతలం సినిమాలో సమంత(Samantha) లుక్ ఎలా ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది. శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను సిల్వర్ స్క్రీన్ మీద చూపించబోతున్నాడు. శకుంతలగా సమంత, దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్‌ మోహన్‌ నటిస్తున్నారు.రుద్రమదేవి లాంటి హిస్టారికల్ సినిమా తీసిన గుణశేఖర్ శాకుతలంతో ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.