సమంత(Samanta ) ఎలాంటి పాత్ర అయినా వదలకుండా ఒకే చెప్పేస్తూ వరుస చిత్రాలతో బిజీగా గడిపేస్తోంది.పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ తో యువతకు మరింత దగ్గర అయ్యింది సమంత.ప్రస్తుతం ఆమె శాకుంతలం (Shakuntala )సినిమా చేస్తోంది.ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబందించి ఎలాంటి అప్డేట్ రాలేదు .కానీ శాకుంతలం షూటింగ్ పూర్తి అయ్యి పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్(Allu arjun ) కూతురు అల్లు అర్హ (Allu arha) మొదటి సారి భరతుడు పాత్రలో బాలనటిగా కనిపిస్తోంది.

మళయాళ హీరో దేవ్ మోహన్ దుశ్యాంతుడిగా నటిస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా మొదటి అప్డేట్ వచ్చింది. శాకుంతలం (Shakuntalam )మూవీ నుండి ఫిబ్రవరి 21న సమంత ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ని వదిలారు. సమంత (Samantha )కొత్త కోనంలో నటిస్తున ఈ సినిమా ఎలా ఉంటుందో అని ప్రేక్షకులకు ఎదురు చూస్తున్నారు.ఇక ఈ సినిమాని గుణశేఖర్ (Guna shekar )భారీ బడ్జెట్ తో స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు.ఫస్ట్ లుక్ తో సమంత ఎలాంటి అంచనాలు పెంచుతుందో చూడాలి