పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్` విడుదల వాయిదా పడడం ఇండస్ట్రీలో  ఇతర సినిమాలకు వరంగా మారిన సంగతి తెలిసిందే.  ఆర్ఆర్ఆర్ సంక్రాంతి బరి నుంచి తప్పుకోవడంతో చిన్న బడ్జెట్ సినిమాలకు కొంతవరకూ లైన్ క్లియర్ అయింది. ఈ సంక్రాంతికి `భీమ్లా  నాయక్` చిత్రం కూడా  విడుదల కాకపోవడం మరికాస్త కలిసొచ్చే అంశం. దీంతో చిన్న బడ్జెట్ సినిమాల విడుదలకి సంక్రాంతి ఒక గొప్ప వేదిక అయింది.

ఈ క్రమంలోనే తాజాగా ఆది సాయి కుమార్ నటించి `అతిథి దేవో భవ` సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ జనవరి 7న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో పొలిమేర నాగేశ్వర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రామ సత్యన్నారాయణ రెడ్డి సమర్పిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నువేక్ష నటిస్తుంది. శేఖర్ చంద్ర సంగీత స్వరాలు అందిస్తున్నారు.