పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan )సరికొత్త లుక్ లో సందడి చేస్తు,డిఫరెంట్ గెటప్ లో అలరిస్తున్నాడు. పవన్ కి సంబంధించిన ఒక న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోందీ.
పవన్ కళ్యాణ్ ని డిఫరెంట్ లుక్స్ లో చూడాలని ఆయన అబిమానులు ఆశ పడుతుంటారు..
ఇప్పుడు ఒక అదిపోయె పవన్ కల్యాణ్ లుక్ ఒకటి లీక్ అవ్వగా అది వైరల్ గా మారింది.
తెల్ల పంచె,తెల్ల చొక్క,బుజం పైన నల్లటి గొంగలి, చేతిలో ముల్లు కర్ర ,ఆ కర్రకు ఎర్రటి తువ్వాలు,కాలుకి కడియం ,కిర్రు చెప్పులు వేసుకుని పవన్ కళ్యాణ్ సరికొత్తగా కనిపిస్తున్నారు. భీంలా నాయక్ సాంగ్ (Bheemla Nayak Song)కోసం ఈ గెటప్ వేసినట్టు సమాచారం.మళయాళ సినిమా అయ్యప్పనుమ్ కోశియంకి రీమెక్ గా వస్తోంది భీమ్లానాయక్.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో(Pawan kalyan) పాటు రాణా(Rana) కూడా నటిస్తున్నాడు. ఈ నెల 25న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది .త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Sreenivas) మాటలు, స్క్రీన్ ప్లే అందించగా ,సాగర్ కె చంద్ర
దర్శకత్వం వహిస్తున్నారు.తమన్(Thaman) సంగీతంలో ఇప్పటికే వచ్ఛిన పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. బీమ్లనాయక్ (Bheemla nayak)టైటిల్ సాంగ్ సూపర్ క్రేజ్ సోంతం చేసుకుంది.ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ సరసన నిథ్యామీనన్(Nithya meenan) నటిస్తోంది.