శ్యామ్ సింగరాయ్ ( Shyam Singh roy ) లాంటి హిట్ తరువాత నేచురల్ స్టార్ నాని(Nani) నటిస్తున్న చిత్రం “అంటే సుందరానికి”.మలయాళ భామ నజ్రియా ఈ మూవీతో మళ్ళీ రి ఎంట్రీ ఇస్తోంది.మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఇక ఇటీవల ఏకంగా 7 రిలీజ్ డేట్స్ ప్రకటించి మూవీపై ఆసక్తి పెంచింది మేకర్స్ తాజాగా అంటే సుందరానికి సాంగ్ షూటింగ్ కి సంబంధించిన స్టైల్ ఒకటి సోషల్ మీడియాలో విడుదల చేసారు. ఈ పిక్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఈ పిక్ లో హీరో నాని,హీరోయిన్ నజ్రియా, డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ కనిపించారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఇది ఒక పాటకి సంబంధించిన స్టిల్ అని తెలుస్తోంది.సమ్మర్ కానుకగా అంటే సుందరానికి(Ante Sundaraniki ) మూవీ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ మూవీలో నాని(Nani) ఒక వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. శ్యామ్ సింగరాయ్ తో హిట్ కొట్టిన నాని(Nani) అంటే సుందరానికి మూవీతో మరో హిట్ కొడతాడేమో చూడలి