టాలీవుడ్ లో మళ్లీ కొత్త సినిమాల రిలీజ్ సందడి మొదలైంది. ఫిబ్రవరి నెలలో ఇప్పటికే ఖిలాడి (khiladi), డీజే టిల్లు (Dj tillu ) మూవీస్ రిలీజ్ అయ్యి థియేటర్లో సందడి చేస్తున్నాయి. ఇప్పుడు ఫిబ్రవరి 25న మూడు సినిమాలు ఒకేసారి థియేటర్లోకి రానున్నాయి .వరుణ్ తేజ్ గని,శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు అలాగే యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన శెబాస్టియన్ ఫిబ్రవరి 25న రిలీజ్ కానున్నాయి. వీటిలో ఎక్కువ క్రేజ్ వరుణ్ తేజ్ నటించిన గని పై ఉంది .ఇటీవల కాలంలో లో వరుణ్ తేజ్ నటించిన సినిమాలు వరుసగా హిట్ అవుతున్నాయి. గనిలో వరుణ్ బాక్సర్ గా కనిపిస్తూ సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు .ఈ సినిమాలో కన్నడ ,బాలీవుడ్ నటులు కూడా నటిస్తూ ఉండడం ,తమన్ అందించిన మ్యూజిక్ ఇప్పటికే హిట్ కావడంతో గని మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక అదే రోజు వస్తున్న మరో క్రేజీ మూవీ శర్వానంద్ నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు విడుదల అవుతోంది. తిరుమల కిషోర్ దర్శకత్వంలో శర్వానంద్ రష్మిక మందన నటించిన ఈ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి .ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన టీజర్ కి మంచి రెస్పాన్స్ రాగా దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ మూవీ యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ పోటీకి దిగుతుంది. ఇక అదే రోజు రిలీజ్ అవుతున్న మూడవ సినిమా కిరణ్ అబ్బవరం నటించిన శెబాస్టియన్ . ఇటీవల రిలీజైన ఈ ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంది .టీజర్ మొత్తం కామెడీని పంచడంతో ఈ మూవీ కామెడీ లవర్స్ ని టార్గెట్ చేస్తూ బరిలోకి దిగుతోంది. మూడు సినిమాలు విభిన్నమైన క్యాటగిరి తో రిలీజ్ అవుతుండటంతో ఏ సినిమా హిట్ అవుతుంది అన్నది ఆసక్తికరంగా మారుతుంది .మరి వీరిలో బాక్సాఫీస్ వద్ద ఎవరు హిట్ అందుకుంటారో చూడాలి.