మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా నటిస్తున్న చిత్రం గని. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ (Varun Tej ) ఒక బాక్సర్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన గని (Ghani )చిత్రం ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని సస్పెన్స్ నెలకొన్న నేపథ్యంలో గని ( Ghani )చిత్ర యూనిట్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీని ఫిబ్రవరి 25న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు ,కానీ అదే రోజు మరో రెండు మూడు సినిమాలు పోటీకి ఉండడంతో ఇప్పుడు రిలీజ్ డేట్ ను మార్చే పనిలో ఉన్నారు. దీనికి సంబంధించి ఒక పోస్టర్ ని రిలీజ్ చేసిన చిత్ర యూనిట్, గని ( Ghani )మూవీ రిలీజ్ డేట్ ని ఈరోజు మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషాల కు ప్రకటిస్తామని కొద్దిసేపటి క్రితం ట్విట్టర్లో తెలిపారు. మరి ముందుగా ప్రకటించినట్లుగా ఫిబ్రవరి 25న రిలీజ్ చేస్తారా లేదా వేరే డేట్ అనౌన్స్ చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో కన్నడ నటుడు ఉపేంద్ర ( Upendra ) అలాగే బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి (Sunil shetty )కీలక పాత్రల్లో నటిస్తున్నారు .ఈ మూవీకి తమన్ (Thaman s )మ్యూజిక్ ని అందిస్తుండగా గీత ఆర్ట్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. మరి భారీ అంచనాలతో వస్తున్న వరుణ్ తేజ్ (Varun Tej ) గని (Ghani ) ఏ రేంజ్ లో హిట్ సాధిస్తుందో చూడాలి.