నరేంద్ర మోడీ (Narendra Modi ) ప్రధానిగా బీజేపీ(BJP ) ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. ఇకమరో కార్యక్రమం మొదలు పెట్టారు ప్రధాని మోడీ. పంట పొలాల్లో పురుగుల మందులు పిచికారీ చేయడానికి మోడీ(Modi) ప్రభుత్వం ఒక పని ప్రారంభించింది.దేశంలో ఉన్న పొలాల్లో పురుగుమందులు పిచికారీ చేయడానికి 100(Kisan Drone ) కిసాన్ డ్రోన్ లను ప్రధానమంత్రి మోడీ ప్రారంభించారు. దేశంలో పలు నగరాల్లో ,సిటీల్లో దీన్ని ప్రారంభించారు. రైతులకు సహాయ పడటానికి మోడీ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. పొలంలో సాగులో పనులు మరింత సులభం అవ్వడానికి మోడీ ప్రభుత్వం దీన్ని అమల్లోకి తెచ్చింది .రైతులకు ఉపయోగ పడే విధంగా ప్రత్యేక డ్రైవ్లో దేశం (India)మొత్తం ఈ పని ఏ ఆకట్టం లేకుండా చేసేలా ప్లాన్ చేసారు.వచ్చే రెండు సంవత్సరాలలో గరుడ ఏరోస్పెస్ తరపున లక్ష మేడ్ ఇన్ ఇండియా డ్రోన్లను తయారు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.మోడీ (Modi )చేపట్టిన ఈ కార్యక్రమంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Recent Comment