రామ్‌చరణ్‌ హీరోగా స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో కియారా అడ్వాణీ కథానాయిక. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. రామ్‌చరణ్‌ తన రెమ్యునరేషన్ భారీగా పెంచినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఏకంగా రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.
ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ కూడా ‘స్పిరిట్‌’ మూవీ కోసం రూ.100 కోట్లు పారితోషకంగా తీకుంటున్నారని ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక ప్రభాస్‌ తర్వాత అంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో చెర్రీనే అని నెటిజన్లు అనుకొంటున్నారు.
మరోవైపు యంగ్‌ టైగర్‌  ఎన్టీఆర్‌తో కలిసి రామ్‌చరణ్‌  నటించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్‌ ఇండియా సినిమాను డీవీవీ దానయ్య నిర్మించాడు. వచ్చే ఏడాది జనవరి 7న ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో అల్లూరి సీతారామరాజుగా నటించిన రామ్‌చరణ్‌ ఏకంగా రూ.45 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకున్నాడట. అలాగే కొమురం భీమ్‌గా నటించిన  ఎన్టీఆర్‌ సైతం 45 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకున్నట్లు సమాచారం.