మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ కథానాయకులుగా నటించిన సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో దూసుకుపోతున్న ఆర్ఆర్ఆర్ చిత్రబృందం.. తాజాగా ఎఫ్ సీ ఎంటర్టైన్మెంట్ కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఇందులో డైరెక్టర్ రాజమౌళితో పాటుగా హీరోలు ఎన్టీఆర్ – రామ్ చరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నందమూరి – మెగా కుటుంబాల మధ్య ఉన్న బాక్సాఫీస్ పోరు గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ”చరణ్ నాకు ఆప్తమిత్రుడు. మా రెండు కుటుంబాల మధ్య దాదాపు 35 ఏళ్లుగా బాక్సఫీసు వద్ద పరోక్ష యుద్ధం కొనసాగుతోంది. కానీ  మేమిద్దరం మంచి స్నేహితులుగా ఉంటున్నాం.. మా మధ్య ఎప్పుడూ ఆరోగ్యకరమైన వాతావరణమే ఉంటుంది అని ఎన్టీఆర్ అన్నారు.
కాగా, ఈ సినిమాలో బాలీవుడ్‌ నటి అలియా భట్, హాలీవుడ్‌ హీరోయిన్ ఒలివియా మోరిస్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖనిలు ముఖ్య పాత్రల్లో అలరించనున్నారు. డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు.