ఆంధ్రప్రదేశ్ (Ap )మాజీ సీఎం నారా చంద్రబాబు( chandra babu naidu ) నాయుడు గారి భూమి కబ్జాకు గురైంది చంద్రబాబు నాయుడు స్వస్థలమైన నారావారిపల్లెలో ఆయన భూమి మరో వ్యక్తి కబ్జా చేసినట్టు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలానికి(Chandragiri ) చెందిన నారావారి పల్లి గ్రామంలో చంద్రబాబుకు 38 సెంట్ల ఒక స్థలం ఉంది. కానీ రాజేంద్ర నాయుడు అనే వ్యక్తి ఆ భూమిని కబ్జా చేసి ఆ స్థలంలో కుసాలు నాటుకున్నాడు.దాంతో చంద్రబాబు కుటుంబ సభ్యులు పోలీసులకు పిర్యాదు చేసారు.ఆ స్థలానికి సంబంధించిన పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా ఉండడంతో నారా రామ్మూర్తి నాయుడు భార్య ఇందిరమ్మ చంద్రగిరి(Chandragiri) ఎమ్మార్వోకి ఫిర్యాదు చేశారు.దాంతో ఈ విషయం వైరల్ అయ్యింది. ఈ భూమి లో చంద్రబాబు(Chandra babu naidu ) కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగకి క్రీడా పోటీలు నిర్వహిస్తామని ఫిర్యాదులో తెలిపారు.