టాలీవుడ్ లో వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేష్ (Mahesh babu )సరిలేరు నీకెవ్వరుతో సూపర్ హిట్ అందుకున్న మహేష్ లేటెస్ట్ గా సర్కారువారి పాటలో నటిస్తున్నారు. ఈ సినిమా మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది .ఇక ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఒక సినిమా స్టార్ట్ చేశాడు మహేష్.ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా కంప్లీట్ అయ్యాయి.ఇక త్వరలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు .ఈ చిత్రంలో మహేష్ కి జోడిగా పూజ హెగ్డే నటిస్తున్నారు .ఇక ఈ చిత్రంలో మరో హీరోయిన్ కూడా స్కోప్ ఉందట. శ్రీలీలను సెకండ్ హీరోయిన్ గా తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారు. పెళ్లి సందడి మూవీలో మంచి క్రేజ్ తెచ్చుకున్న శ్రీలీల ఇపుడు మహేష్ బాబు తో కూడా నటించబోతోంది. ఇటీవల కాలంలో త్రివిక్రమ్ మూవీస్ లో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు.అందుకే మహేష్ బాబు మూవీలో కూడా మరో హీరోయిన్ శ్రీలీలను తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. ఈ మూవీలో ఆమెకు ఆఫర్ వస్తే ఆమెకు గోల్డెన్ ఛాన్స్ దక్కినట్టే.ఇప్పటికే ఆమెకు యూత్ లో క్రేజ్ ఏర్పడింది. అలాగే ఇండస్ట్రీలో కూడా ఆమెకు ఆఫర్స్ ఇవ్వడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. మరి శ్రీలీలకు మహేష్ బాబు మూవీలో ఛాన్స్ వస్తుందా లేదా అన్నది చూడాలి