సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’.  గీత గోవిందం ఫేమ్ ప‌పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్‌ హీరోయిన్‌.. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి. మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇంకా ఓ నెల రోజుల పాటు షూటింగ్ చేయాల్సివుంది. ఇలాంటి సమయంలో మ‌హేష్ మోకాలికి స‌ర్జ‌రీ చేయించుకోవాల్సి రావ‌డంతో షూటింగ్ కి బ్రేక్ ప‌డింది. తిరిగి షూటింగ్ ఫిబ్ర‌వ‌రి నుంచి ప్రారంభం  కానున్న‌ట్టుగా తెలుస్తోంది.

అయితే.. ఈ సర్జరీ తర్వాత మహేష్ త్వరగానే రికవర్ అవుతుండటంతో ఫిబ్రవరి నెలలో స్టార్ట్ చెయ్యాల్సిన షూటింగ్ జనవరిలోనే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నార‌ట‌. ఈ షెడ్యూల్‌లో మహేష్ జాయిన్ కానున్నారని తెలుస్తుంది. దీని పై త్వరలో కన్‌ఫర్మేషన్ రానుందని అంటున్నారు. ఇక ఈ సినిమాకి సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ సాంగ్స్ రెడీ చేయ‌డం జ‌రిగింది. అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చాడ‌ని టాక్ వినిపిస్తోంది.

ఈ మూవీ సాంగ్స్ కు సంబంధించి అప్ డేట్ ఏంటంటే.. జ‌న‌వ‌రి ఫ‌స్ట్ వీక్ లో స‌ర్కారు వారి పాట‌ ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ చేయ‌నున్నార‌ని స‌మాచారం. ఇక అప్ప‌టి నుంచి ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేయ‌నున్నారు. జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, 14 రీల్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 1న స‌ర్కారు వారి పాట‌ను ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి.. స‌ర్కారు వారి పాట‌తో మ‌హేష్ ఏ రేంజ్ స‌క్స‌స్ సాధిస్తారో చూడాలి.