నందమూరి బాలకృష్ణ వరస ప్రాజెక్టులతో బిజీ అవు తున్నారు .అఖండ మూవీతో బ్లాక్ బాస్టర్ కొట్టడమే కాకుండా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయారు. ఇక తర్వాత గోపీచంద్ మలినేనితో(Gopichand Malineni) ఒక మూవీ చేస్తున్న బాలయ్య(Balakrishna) ఆ తరువాత అనిల్ రావిపూడితో (anil ravipudi)కూడా ఒక మూవీ ని లైన్ లో పెట్టారు. ఇప్పుడు మరో దర్శకుడితో బాలయ్య సినిమా చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. రచ్చ ,సిటీ మార్ లాంటి మాస్ చిత్రాలను తెరకెక్కించిన సంపత్ నంది(Sampath nandi) డైరెక్షన్లో బాలయ్య సినిమా చేస్తున్నట్లు సమాచారం. ఈ మాస్ డైరెక్టర్ బాలయ్య(Balakrishna) కోసం ఒక పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేశారట .ఈ స్టోరీని బాలయ్యకు వినిపించగా కథ కూడా ఆయనకు నచ్చినట్టు తెలుస్తోంది. సంపత్ నంది, బాలయ్యతో సినిమా చేయడానికి ఎప్పటినుండో ట్రై చేస్తున్నారు .అందుకే ఒక మాస్ యాక్షన్ స్టోరీ తో బాలయ్య ముందుకు వెళ్లారట. ఈ కథపై బాలకృష్ణ పాజిటివ్ గా స్పందించారని సమాచారం. మరి సంపత్ నందికి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఒకవేళ ఈ మూవీ ఒకే అయినా గోపీచంద్ ,అనిల్ రావిపూడి సినిమాల తర్వాత సంపత్ నందితో బాలయ్య మూవీ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Recent Comment