పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) ,రానా(Rana) హీరోలుగా వస్తున్న భారీ సినిమా భీంలా నాయక్(Bheemlaa Nayak ).పవన్ కి జోడిగా నిథ్యామీనన్(Nithya meenon ), రానా దగ్గుబాటికి జోడిగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఈ సినిమాకు సాగర్ కె చంద్ర (Sagar k chandra )దర్శకత్వం వహిస్తున్నారు.భీమ్లానాయక్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 21న జరగబోతోంది.ఈ ఈవెంట్ కి అతిథిగా తెలంగాణ(Telangana) మంత్రి KTR రాబోతున్నారు.దీనిపై అధికార ప్రకటన చేశారు చిత్ర యూనిట్. ఇక ఇప్పటికే వచ్చిన టీజర్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భీమ్లానాయక్ ఫిబ్రవరి 25న గ్రాండ్ గా విడుదల అవుతోంది.మళయాళంలో సూపర్ హిట్ అందుకున్న అయప్పనుమ్ కోషియం చిత్రానికి రీమేక్ గా వస్తున్న భీమ్లానాయక్(Bheemlaa Nayak ) సినిమాను సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.ఇక తమన్(S Thaman ) సంగీతంలో వచ్చిన ఈ సినిమా పాటలు ఇప్పటికే మంచి హిట్ అందుకున్నాయి.