అయ్యప్పనుం కోషియం సినిమాకి రీమేక్ గా వస్తున్న సినిమా భీమ్లా నాయక్(Bheemla Nayak). సూర్య దేవర నాగ వంశీ దాదపుగా 100 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తుండగా , సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు . ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు మరియు పాటలు ఎంతగానో అలరించాయి , అంతే కాకుండా సినిమాపైన అంచనాలని పెంచాయి.పవన్ కళ్యాణ్ (Pawan kalyan),రాణా దగ్గుబాటి (Rana daggubati) నిత్యామీనన్ ,సంయుక్త మేనన్, బ్రహ్మానందం, మురళీ శర్మ, రఘుబాబు,వివి వినాయక్ ఈ సినిమా లో నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమా ని ఫిబ్రవరి 25 న విడుదల చేయబోతున్నారు అంతే కాక ఫిబ్రవరి 21 న జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా ట్రైలర్ ని కూడా రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం. ఈ ట్రైలర్‌లో మాస్‌ అంశాలను అందరికీ నచ్చేలా చూపించబోతున్నారట. యూట్యూబ్ లో ఈ ట్రైలర్ ఏలాంటి రికార్డ్స్ ని బద్దలు కొడ్తుందో చూడాలి . అలాగే ఎన్నో అంచనాలతో రిలీజ్ అవుతున్నా సినిమా యెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో అని అందరు ఆసక్తిగా యెదురు చూస్తున్నారు.