ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషనల్‌లో వచ్చిన మూడో చిత్రం ‘పుష్ప: ది రైజ్’. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంస్థలు నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైంది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్లను కొల్లగొడుతూ దూసుకుపోతోంది. వివిధ భాషల్లో విడుదలై అయి పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా ఉత్తరాదిలో ఆధిపత్యం చూపిస్తోంది అని చెప్పొచ్చు.
ఇప్పటి వరకు పుష్ప సినిముఖ్ బాలీవుడ్ లో 42 కోట్ల రూపాయలకి పైగా కలెక్షన్లను సాధించినట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో 50 శాతం ఆక్యుపన్సి ఉన్నప్పటికీ చాలా పుష్ప జోరు ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే త్వరలోనే పుష్ప చిత్రం 50 కోట్ల మార్క్ ను అందుకునే ఛాన్స్ ఉంది. కాగా, ఈ సినిమాలో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. తెలుగు, తమిళం సహా హిందీలోనూ మంచి కలెక్షన్లను వసూలు చేస్తుంది ఈ చిత్రం. కాగా, ఈ చిత్రం రెండో భాగం ‘పుష్ప: ది రూల్’ షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది
Recent Comment