బాహుబలితో పాన్ ఇండియాన్ స్టార్ గా మారాడు ప్రభాస్(Prabhas ).కరోనా వల్ల వాయిదా పడిన చిత్రాలను తిరిగి షూటింగ్ శరవేగంతో పనులు మొదలు పెట్టాడు.ఇక రాధే శ్యామ్(Radhe Shyam) సినిమా మార్చి 11 న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇక సలార్(Salaar), ఆది పురుష్(Adi purush ) చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి.తాజాగా ఇప్పుడు మారుతి(Maruthi ) తో కలసి పాన్ ఇండియా సినిమా చేయటానికి ప్రభాస్ ఓకే చెప్పాడు. అయితే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని సమాచారం.ఇద్దరు టాలీవుడ్ నుండి ఇద్దరు ముద్దుగుమ్మలు బాలీవుడ్ నుండి ఒక స్టార్ హీరోయిన్ తీసుకుంటున్నారు. ఇక ఈ మూవీతో మారుతి పాన్ ఇండియా డైరెక్టర్ గా మారబోతున్నాడు.ఇక ఈ సినిమా రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. మిర్చి తరువాత ప్రభాస్ నుండి వస్తున్న లవ్ అండ్ రొమాంటిక్ మూవీగా ఈ మూవీ వస్తోంది.
Recent Comment